తెలుగునాట జానపద కళారూపాల అభివృధ్ధికి, గ్రంథాలయాల వ్యాప్తికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృషిచేశారు. ఈర్ష్య, ద్వేషాలతో మనిషి మనశాంతి కోల్పోయి పతనమౌతాడని వాటికి దూరంగా శాంతితో జీవనం చేయాలని ఆచరించి చూపిన ధీరశిలి. ఉత్తమ ఆశయశీలిగా చీరాల-పేరాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రామనగరు రంగభూమి సారధిగా, తెలుగు ప్రజల హృదయంలో శాశ్వతస్ధానం పొంది, క్షయవ్యాధికి గురై.. 2ఏళ్ల పాటు బాధపడ్డ ఆయన 1928 జూన్10న మరణించారు.