త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తహసీల్దార్, ఎంపీపీ

74చూసినవారు
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తహసీల్దార్, ఎంపీపీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ హిమబిందు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యశోద, పోలీస్ స్టేషన్ లో ఎస్సై సత్యనారాయణ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో నవీన్ కుమార్, గ్రంథాలయంలో గ్రంథపాలకుడు రాజు, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సత్యనారాయణలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.