108లో మహిళ ప్రసవం
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన బండారు నవనిత (24)కి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే నవనితని హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో కష్టపడి అంబులెన్స్ లో సుఖ ప్రసవం చేశారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి ప్రభాకర్, పైలట్ ప్రశాంత్ లను కుటుంబ సభ్యులు అభినందించినారు.