మతిస్థిమితం లేక పురుగు మందు సేవించి బాలుడు మృతి
సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామానికి చెందిన పేరం భాను ప్రసాద్ (11) అనే బాలుడు మంద బుద్ధితో పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.