తాడ్వాయి: గంధపు చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు
ఓ రైతు వ్యవసాయ బావి దగ్గర పెంచుతున్న గంధపు చెట్లను గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన తాడ్వాయిలో చోటుచేసుకుంది. రైతు అకేటి శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ పొలం ఒడ్ల చుట్టూ 4 సంవత్సరాల క్రితం 10 గంధపు చెట్లను నాటుకొని సాగు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం రాత్రి సమయంలో వ్యవసాయ బావి దగ్గర ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని దొంగలు ఏడు గంధపు చెట్లను యంత్రాల సహాయంతో కోసి దొంగిలించారన్నారు.