కాంగ్రెస్ గీత దాటితే మేము దాట‌తాం: మాజీ మంత్రి

73చూసినవారు
TG: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్‌లోని త‌ల‌సాని నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశం అని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చించామని పేర్కొన్నారు. మేయర్ పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ గీత దాటితే తాము గీత దాటుతామ‌ని ఆయ‌న అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్