ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం హిందు సంఘాలబంద్ విజయవంతంకాగా, భారీ సంఖ్యలో హిందుసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు కాషాయ జెండాలు చేతబట్టి భారీర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తా నుండి గాంధీచౌక్ వరకు ర్యాలీ జరిగింది. హిందు ఆలయాలను రక్షించాలని, ఆలయాలపై దాడులకు దిగిన వారిని చట్టపరంగా కఠినశిక్షలు పడేలా చేసి, ఆలయాలపైదాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హిందు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.