సొంత ఖర్చులతో విద్యుత్ స్తంభాలు, నీరు నిల్వకుండా సిమెంట్ పైపులు వెయిస్తానని ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణ హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని రేపల్లెవాడలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలమేరకు గ్రామంలో గ్రామసభ పెట్టి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేతో మాట్లాడి త్వరలో నీటి సమస్య, బిటిరోడ్డుకు నిధులు మంజూరు చేయస్తామన్నారు. గ్రామ సభలో ఎఎంసీ చైర్మెన్ రజిత వున్నారు.