టిపిటిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలిసి కుల గణనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి శనివారం చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎన్యూమరేటర్ల సంఖ్య పెంచడం, సర్వే గడువును పొడిగించడం వారి దృష్టికి టిపిటిఎఫ్ జిల్లా శాఖ తీసుకువెళ్లడం జరిగింది. ఎన్యూమరేటర్లు సంఖ్య పెంపుకై, అలాగే సర్వే గడువు పెంపుపై ప్రభుత్వానికి నివేదిస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చారు.