పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకొని, ప్రతీ గ్రామంలో గుడి నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ బుధవారం డిమాండ్ చేశారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయం పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.