ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 7వ వార్డు లోని సమస్యలను శనివారం మాజీ వార్డు సభ్యులు బీజేపీ నాయకుడు ప్యాలాల రాములు, 7వ వార్డు ప్రజలతో కలిసి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ వద్దకు వార్డు సమస్యలు చెప్పారు. స్పందించిన చైర్మన్ వారితో కలిసి 7వ వార్డుకు స్వయంగా వెళ్లి అక్కడి సమస్యల తెలుసుకున్నారు. ఈ సమస్యలు ఎమ్యెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.