మధ్యప్రదేశ్‌లో ప్రియురాలితో కలిసి తిరుగుతున్న సర్పంచ్‌కు భార్య షాక్ ఇచ్చింది. నిముచ్ జిల్లా సావాన్ గ్రామంలో సర్పంచ్ జితేందర్ తన ప్రేయసితో కలిసి కారులో విహరిస్తున్నాడు. వారిద్దరినీ జితేందర్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సడన్‌గా వారి కారుకు అడ్డంగా వచ్చి నిలబడింది. భర్తతో పాటు అతడి ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. తనపై దాడి చేసిందని సర్పంచ్ భార్యపై అతడి ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.