భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో తిలక్ నాలుగు మ్యాచ్ల్లో 140 సగటు, 198 స్ట్రైక్ రేటుతో 280 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2020/21లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 115 సగటు, 147 స్ట్రైక్ రేటుతో కోహ్లీ 231 పరుగులు చేశాడు.