లింగంపేట్ మండలంలోని శెట్టిపల్లిలో వడ్లు దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం గురువారం రాత్రి అట్టెం మల్లయ్య పిల్లి శ్రీనివాస్ బోడోల్ల మైసవ్వకు చెందిన సన్న రకం వడ్లు దొంగతనం జరిగినట్లు తెలిపారు. అంతకుముందు కాంట జోకిన వడ్ల బస్తాలను కూడా ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రాత్రి దొంగను వెంబడించిన తప్పించుకొని పోయారని తెలిపారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.