చొప్పదండి: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య గతంలో సౌదీలో మరణించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నారై పాలసీలో భాగంగా రూ. 5 లక్షల చెక్కును ఆయన భార్యకు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం అందించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఉన్నారు.