కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఇవాళ భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. పుష్కరిణిలో స్నానంచేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇది ఇలా ఉండగా, వరంగల్ జిల్లా నుంచి అంజన్న దీక్ష పరులు భారీగా చేరుకుని, మాల విరమణ చేశారు.