పట్టా పాస్ బుక్ లు అందించాలని ప్రభుత్వ విప్ కు వినతి
ధర్మపురి మండలం కమలపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కులస్తులకు 751 సర్వే నెంబర్లో గల స్థలాన్ని ఒక్కొకరికి 10 గుంటల చొప్పున గత ప్రభుత్వం పంపిణీ చేసినప్పటికీ దానికి సంబంధించిన పట్టా పాస్ బుక్కులు జారీ చేయకపోవడంతో వారికి పట్టాలు జారీ చేయాలని కోరుతూ గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.