ప్రభుత్వ విప్ ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్
ధర్మపురి మండల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన చిలుముల లావణ్య లక్ష్మణ్, వైఎస్ చైర్మన్ సంగా నర్సింహులు, కమిటీ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. తమ నియామకానికి సహకరించిన లక్ష్మణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.