Sep 16, 2024, 10:09 IST/
ఆసుపత్రి బెడ్‌పై రెస్ట్ తీసుకుంటున్న కుక్క (వీడియో)
Sep 16, 2024, 10:09 IST
యూపీలోని బులంద్‌షహర్ జిల్లా ఆసుపత్రి వీధి కుక్కలకు నిలయంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోను పరిశీలిస్తే రోగుల బెడ్‌పై కుక్క విశ్రాంతి తీసుకుంటోంది. దీనిని ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదు. కుక్క హాయిగా నిద్రపోతుంది. దీని వల్ల కుక్కల నుంచి రోగులకు ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.