కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో కడ్డ అంజవ్వ(50)ను సంపత్ అనే వ్యక్తి తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ అంజవ్వను 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కడ్డ చంద్రయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో అంజవ్వను రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా మొదటి భార్య కుమారుడు సంపత్ ఆస్తి విషయంలో మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం అంజవ్వ తలపై కర్రతో కొట్టినట్టు సమాచారం.