సైదాపూర్ లో వైఎస్ వర్ధంతి వేడుకలు

72చూసినవారు
సైదాపూర్ లో వైఎస్ వర్ధంతి వేడుకలు
సైదాపూర్ మండల కేంద్రంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రారెడ్డి,ఎర్రాల శ్రీనివాస్, మండల కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్