సిరిసిల్ల జిల్లా వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న రానున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. దక్షిణ కాశిగా పేరొందిన శ్రీ రాజారాజేశ్వర స్వామి దేవాలయంలో సీఎం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ గురించి చర్చిస్తారు.