హుజురాబాద్: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ వెంకట్
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మానవత్వం చాటుకున్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో హుజురాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. ప్రమాదాన్ని గమనించి తను కారును ఆపించారు. అనంతరం అక్కడ ప్రమాదానికి గురైన క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపి భరోసా కల్పించారు.