హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం
హుజురాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భానుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం ప్రచారం నిర్వహించారు. పదేళ్ల బిఆర్ఎస్ బిజెపి పాలన వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.