జగిత్యాల పట్టణంలోని రాం బజార్ రోడ్ లో గల దుకాణ సముదాయాలలో ఆదివారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దుకాణాల షెటర్లు పగలగొట్టి దోపిడీలకు పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. మారుతి సూపర్ మార్కెట్, ఒక కిరాణా షాప్, ఇతర షాపులలో దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది మారుతి సూపర్ మార్కెట్లో దాదాపు పదివేల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టారు