Nov 28, 2024, 02:11 IST/చొప్పదండి
చొప్పదండి
సిరిసిల్ల: పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
Nov 28, 2024, 02:11 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ బుధవారం బోయనపల్లి మండలం మల్లాపూర్ లోని పాఠశాలను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టడం జరిగింది. విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ జీపీఏ సాధించుటకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంగ, విజయ, చంద్రం పాల్గొన్నారు.