కథలాపూర్: వరద కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఓ వృద్ధురాలు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చూయించుకున్న నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ వెల్లడించారు.