జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లాలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది గద్దల అమృత రావు వారి సతీమణి గద్దల కవిత దంపతులు తమ క్లైంటును కలవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ పోలీసులు వారిపై దాడి చేసి కొట్టడం సహించలేని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.