అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

13661చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లేపల్లికి చెందిన బుర్ర కరుణాకర్ జీవనోపాధి నిమిత్తం కరీంనగర్ కు వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో కొంత అప్పులు చేశాడు. బుధవారం మనస్తాపంతో పురుగులు మందు తాగడంతో ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కరుణాకర్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్