సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన

80చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన
శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని, బీసీ బాలికల వసతి గృహాన్ని మండల వైద్యాధికారి డా. శ్రావణ్ సందర్శించారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటశాల మంచినీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రపరచుకోవాలని విద్యార్థులకు జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్