మంథని మండలం - Manthani Mandal

కరీంనగర్ జిల్లా
Dec 21, 2024, 09:12 IST/వేములవాడ
వేములవాడ

అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

Dec 21, 2024, 09:12 IST
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు కాదని సక్రమ కేసే అని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కేటీఆర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పనిగట్టుకొని స్పీకర్ మీదికి చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.