మెట్ పల్లి: వీధి కుక్కలను పట్టుకుంటున్న మున్సిపల్ సిబ్బంది
మెట్ పల్లి పట్టణంలో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి, సుజాత, సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టడం జరిగింది. వీధి కుక్కలను అనిమల్ బర్త్ అండ్ కంట్రోల్ సెంటర్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 42 వీధి కుక్కలను పట్టడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను అభినంధించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ వీధి కుక్కలు పట్టే సిబ్బంది పాల్గొన్నారు.