90శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

576చూసినవారు
90శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటేష్ అన్నారు. శనివారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయ బకాయి రూ. 6, 70, 138 మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కి చెక్కు రూపంలో అందజేశారు. ఇంటి పన్ను బకాయిల వడ్డీపై 90శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మేనేజర్ శివప్రసాద్, బిల్ కలెక్టర్ అజయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్