రేపు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

1878చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకురి శంకర్ తెలిపారు. భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్