కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్ష

1241చూసినవారు
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆర్.ఎం.పీ, పీ.ఎం.పీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమీషనర్ ఉదయ్ కుమార్, ఆర్.డి.ఓ శంకర్ కుమార్, ఎం.ఆర్.ఓ సుధాకర్, వన్ టౌన్ సీఐ పర్ష రమేష్ వారితో చర్చించారు.

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన లేబర్ క్యాంప్ లలో ఉంటున్న వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని కోరగా వారు సుముఖత వ్యక్తం చేసారు. రామగుండం నగర పరిధిలో రెండు వందలకు పైగా ఆర్.ఎం.పీ, పీ.ఎం.పీ వైద్యులు ప్రాధమిక వైద్య సేవలందిస్తున్నారని ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు స్పందించి వీరంతా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు.

బృందాలుగా వెళ్లి వలస కార్మికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తదితర పరీక్షలు నిర్వహిoచి నివేదిక ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్లినిక్ లకు వచ్చే పేషంట్ లను పరీక్షించినప్పుడు కరోనా వైరస్ ప్రభావం వలన కలిగే గొంతు నొప్పి, జ్వరం, జలుబు తదితర లక్షణాలు కనిపిస్తే హెల్ప్ లైన్ కు వెంటనే సమాచారం అందించాలని మేయర్, కమీషనర్ వారిని కోరారు. అలాగే పేషంట్లలో ఇటీవల ప్రయాణం చేసిన చరిత్ర ఉన్నా, విదేశాల నుండి వచ్చిన వారిని కలిసి ఉన్నా తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆర్.డి.ఓ కోరారు. ఈ సమావేశంలో పలువురు ఆర్.ఎం.పీ, పీ.ఎం.పీ వైద్యులు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి, ముస్తాఫా, కొండ రమేష్, సుధాకర్, రంగా చారి, రవీందర్, శ్రీధర్, రవి, వెంకట పాటి, శంకర్ లింగం, హుస్సేన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నిత్యావసర వస్తువుల హోల్ సేల్ వ్యాపారులు , డిస్ట్రిబ్యూటర్ లతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ పీరియడ్ లో నిత్యావసర ధరలు పెంచి అమ్ముతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ అనిల్ కుమార్ , కమీషనర్ ఉదయ్ కుమార్, వన్ టౌన్ సీఐ పర్ష రమేష్ హెచ్చరించారు. కంపెనీలు ధరలు పెంచడం , రవాణా చార్జీలు పెరగడం వలన ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది తప్పా తాము ధరలు పెంచడం లేదని హోల్ సేల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు తెలపగా ప్రతి షాపు ముందు ధరల పట్టిక తప్పని సరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోల్ సేల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు రాజేష్ శర్మ, అనిల్ రెడ్డి, కిషోర్, మధు, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్