జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో, పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం జాతీయ జెండాను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.