Feb 26, 2025, 11:02 IST/
తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు!
Feb 26, 2025, 11:02 IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీలో సీఎం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని తెలిపారు. 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని వెల్లడించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని సీఎం మోదీని కోరారు.