గొలుసు చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
వేములవాడ మండలంలో ఆదివారం వృద్దురాలి మెడలో నుంచి బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు మంగళవారం విడుదల చేశారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కనిపిస్తే 8712656413 నెంబర్ కి కాల్ చేయాలని పోలీసులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.