కొత్త టీచర్లలో 47 శాతం మహిళలు

58చూసినవారు
కొత్త టీచర్లలో 47 శాతం మహిళలు
TG: రాష్ట్రంలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో మహిళలు 47 శాతం మంది ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 50 శాతానికిపైగా మహిళలున్నారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు అవుతుండటం.. మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉపాధ్యాయుల్లో వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. మొత్తం 10,006 ఉద్యోగుల్లో 4,706 మంది మహిళలు, 5,300 మంది పురుషులు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్