రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా 61వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు.