జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు మ్యాకల పర్శురాములు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శిగా అరేపెల్లి మాజీ సర్పంచ్ సిలువేని మల్లేశంను బుధవారం నియమించారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయలలో అన్యాయం జరుగుతుందని, బీసీల హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బైరాగోని గోపి గౌడ్, కార్యదర్శి ఎడ్ల నరేందర్ నాయకులు సర్పొద్దీన్, దేవయ్య, యాస స్వామి పాల్గొన్నారు.