రాజన్న సన్నిధికి కార్తీక మాస శోభ

79చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం నేపథ్యంలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆలయం ముందు భాగంలో రావి చెట్టు వద్ద కార్తీకదీపం వెలిగించి సేవలో తరించారు. అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్