కార్తీక దీపం: దీప ఫ్యామిలీకి సమస్యలు

19658చూసినవారు
కార్తీక దీపం: దీప ఫ్యామిలీకి సమస్యలు
సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 1261 ఎపిసోడ్‌ కి ఎంటర్ అయ్యింది. గత ఎపిసోడ్‌లో ఆశ్రమంలో మమ్మీడాడీలని చూశాను అంటూ కార్తీక్ దీపకు చెబుతాడు. దాంతో దీప కూడా ‘నేను అత్తయ్య మావయ్యలని చూశాను’ అని చెబుతుంది. 1261వ ఎపిసోడ్‌ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

కార్తీక్ దీపలు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ‘అసలు అమ్మా వాళ్లని కలవలేని ఈ పరిస్థితి ఏంటి మనకి?’ అని కార్తీక్ ఎమోషనల్ అవుతుంటే దీప ఓదారుస్తుంది. డాక్టర్ బాబు అని పిలిస్తే అలా పిలవద్దని చెబుతాడు. మరునాడు ఉదయాన్నే పిల్లల స్కిప్పింగ్ ఆడుకోవడానికి కార్తీక్ తాడు సిద్ధం చేసి ఇస్తాడు.

కార్తీక్ బయట కూర్చుని టీ తాగుతుంటే.. దీప ఇంట్లో పనులు చూసుకుంటుంది. సౌర్య, హిమ తాడు ఆట ఆడుకుంటూ ఉంటారు. సౌర్య ఆడుతూ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతుంది. భయపడిన హిమ పెద్దగా అరుస్తుంది. సౌర్యని ఇంట్లోకి తీసుకుని వెళ్లి కార్తీక్ ప్రాథమిక వైద్యం అందిస్తాడు. సౌర్యకి ఊపిరి ఆగినంత పని కావడంతో కార్తీక్ సౌర్యకు నోటితో ఊపిరి ఇచ్చి, తిరిగి ఊపిరి ఆడేలా చేస్తాడు. సౌర్యకి చిన్నప్పుడు గుండె ఆపరేషన్ చేశాను కదా. గుండెలో హోల్ తిరగబెట్టిందా? అసలు ఏమైంది సౌర్యాకి?’ అనుకుంటూ బయటికి పరుగు తీస్తాడు కార్తీక్.

మరోవైపు ‘రేయ్ వాళ్లకి డబ్బులు కట్టడానికి గడువు తీరిపోతుంది కదరా. జాగ్రత్తగా ఆయన్ని(కార్తీక్‌ని) తీసుకొచ్చెయ్యండి. మిగిలిన కథ నేను నడిపిస్తాను’ అంటూ పిల్లిగడ్డం, పెద్ద గడ్డం రౌడీలని పంపిస్తుంది రుద్రాణి. కార్తీక్ సైకిల్ మీద ఆశ్రమానికి వేగంగా వెళ్తూ ఉంటాడు. ‘సౌర్యకి ఆపరేషన్ చెయ్యాలి రేపటి లోగా.. లేదంటే ప్రమాదం. అందుకే మమ్మీని డబ్బులు అడుగుతాను.. నా బిడ్డని కాపాడుకుంటాను. నేను డాక్టర్‌ని.. నా బిడ్డని కాపాడుకోవాలి. దేవుడా.. నువ్వు దేవుడివా లేక శాడిస్ట్‌వా?’ అంటూ ఏడుస్తూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు.

ఇక కార్తీక్ ఆశ్రమానికి వెళ్లగా ఎప్పుడు కార్తీక్‌ కి ఎదురు పడే వ్యక్తే ఎదురు పడి.. ‘ఆగండి ఎందుకొచ్చారు మళ్లీ ఎందుకొచ్చారు?’ అంటాడు. ‘నేను సమస్యల్లో ఉన్నాను.. ఆ పెద్దవాళ్లు ఎవరో కాదు మా అమ్మనాన్నలే.. నేను వాళ్ల కొడుకుని’ అంటూ నిజం చెబుతాడు. కానీ ఆ వ్యక్తి నమ్మడు. వాళ్లు ఇప్పుడు ఇక్కడ లేరు.. మీరు బయలుదేరండి అంటూ పంపించేస్తాడు. ఇక ఇంట్లో దీప, హిమ ఏడుస్తూ.. సౌర్యని ‘నీకు ఏం కాదు’ అంటూనే ఉంటారు.

ఇక కమింగ్ అప్‌లో.. కార్తీక్‌ని పిల్లి గడ్డం, పెద్ద గడ్డం రౌడీలు ఆపేస్తారు. ‘నువ్వు మాతో రావాల్సిందే.. అక్క తీసుకుని రమ్మంది’ అని పట్టుబడతారు. ‘ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు.. నా బిడ్డ డాక్టర్ బాబు.. త్వరగా రండి డాక్టర్ బాబు’ అంటూ సౌర్యని ఒడిలో పెట్టుకుని దీప ఎదురు చూస్తూనే, ఏడుస్తూనే ఉంటుంది. కానీ కార్తీక్ రౌడీలు తీసుకుని వెళ్లడంతో రుద్రాణి దగ్గరకు వెళ్తాడు. తర్వాత ఏం జరగనుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

సంబంధిత పోస్ట్