రష్యాకు చెందిన ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ క్యాస్పర్‌స్కై అమెరికాను వీడనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే ప్రకటించింది. తమ ఉత్పత్తుల విక్రయం, పంపిణీని బైడెన్ కార్యవర్గం బ్యాన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. దీనిని విషాదకరమైన కఠిన నిర్ణయంగా ఆ సంస్థ వెల్లడించింది. క్యాస్పర్‌స్కైకు 31 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి. మాస్కో కేంద్రంగా ఇది పనిచేస్తోంది.