తిరుమలలో ఏపీ, తమిళనాడు భక్తుల ఘర్షణ

25337చూసినవారు
తిరుమలలో ఏపీ, తమిళనాడు భక్తుల ఘర్షణ
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో శనివారం భక్తులు కొట్టుకున్నారు. ఏపీ, తమిళనాడు భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. క్యూలైన్‌లో మొదలైన గొడవ క్రమంగా పెద్దదై, చివరికి కొట్టుకునే వరకు వెళ్లింది. గాయపడిన అనంతపురం జిల్లా ఉరవకొండ వాసి సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ వివాదంలో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్