TG: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి పునాది వేసింది కేసీఆరే. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన లాక్కున్నారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. ముక్కు నేలకు రాయాలని అన్నారు.