TG: ప్రజల మధ్య అసమానతలు తొలగించాలని, విద్యార్థులకు ఉద్యోగాలివ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం విధానమైతే.. యువకులు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బానిసత్వంలో ఉండాలనేది కేసీఆర్ విధానమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.25 కోట్ల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తుంటే.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. KCR.. రెసిడెన్షియల్ స్కూళ్లు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.