ఢిల్లి లిక్కరు కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్టై ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదల అనంతరం ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తాజాగా మాతా వైష్ణోదేవిని దర్శించుకోవడానికి కత్రా వెళ్తున్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'X' ద్వారా ఆయన తెలియజేశారు.