అంతర్జాతీయ బ్రెయిన్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఐబీఆర్‌వో) అధ్యక్షురాలిగా శుభా టోలే ఎన్నికయ్యారు. 2028 డిసెంబరు 31 వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. అభివృద్ధి చెందుతోన్న దేశం నుంచి ఈ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐబీఆర్‌వో 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.