వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే విన్నామని.. ఇప్పుడు తమ ప్రభుత్వం చేతల్లో చేసి చూపుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభా ప్రాంగణంలో మంగళవారం సురేఖ మాట్లాడారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ముందుచూపుతో ఉన్నారని చెప్పారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.